హైదరాబాద్, వెలుగు: జీపీ ఎకో సొల్యూషన్స్ లిమిటెడ్ ఎస్‌ఎంఈ ఐపీఓ ఏకంగా 856 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించింది. 20,65,200 షేర్లను అమ్మకానికి పెట్టగా, 176 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. రూ.16,624 కోట్ల విలువైన షేర్ల కోసం కంపెనీ బిడ్స్ అందుకుంది.
కంపెనీ పబ్లిక్ ఇష్యూ జూన్ 14న ఓపెన్ కాగా జూన్ 19 తో ముగిసింది. సోలార్ ఎనర్జీ కంపెనీ అయిన జీఈ ఎకో ఈ ఐపీఓ ద్వారా రూ.30.79 కోట్లు సేకరించింది. ఒక్కో షేరుని రూ.90–94 ప్రైస్ రేంజ్‌లో అమ్మింది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్ల కోసం బిడ్స్ వేశారు. క్యూఐబీ పోర్షన్ 237 రెట్లు సబ్‌స్క్రయిబ్ అవ్వగా, హెచ్‌ఎన్‌ఐ పోర్షన్ 1,825 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 793 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి.