బోయినిపల్లి, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో గురువారం కాంట్రాక్ట్ కార్మికులతో చెత్త సేకరిస్తుండడంతో సమ్మెలో ఉన్న జీపీ కార్మికులు అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ తాము న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నామని తమ సమ్మెను అవమానించవద్దని కాంట్రాక్టు కార్మికులను కోరారు.
కార్యక్రమంలో సీఐటీయూ కన్వీనర్ శ్రీధర్, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.