శివ్వంపేట, వెలుగు: పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జీపీ కార్మికులు శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు 6 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించిన చెల్లించడంలేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.
కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేశ్, కార్యదర్శి శంకర్, బాలకృష్ణ, వసంత, పద్మ, స్వామి, కృష్ణ, హరి పాల్గొన్నారు.