
దేశ వ్యాప్తంగా మరోసారి డిజిటల్ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది. డౌన్ డెటెక్టర్ లోని డేటా ప్రకారం గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ఏప్రిల్ 2న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ట్రాన్సక్షన్స్ జరపడంలో సమస్యలు రావడంతో కస్టమర్లు గందరగోళానికి గురయ్యారు. మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు ఫైర్ అవుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న రాత్రి 8 గంటల నాటికి 449 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కొన్నారు. డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి, సమస్యలు తలెత్తడానికి ప్రస్తుతానికి కారణం ఇంకా తెలియదు.
అయితే వీటిపై సంబంధిత బ్యాంకులు కానీ.. యాప్స్ కానీ వీటితో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.