![Good News : స్పెషలిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. జిప్ మర్ నోటిఫికేషన్](https://static.v6velugu.com/uploads/2025/02/gpemer-specilist-job-notification-details-here_u4EmCYIMxp.jpg)
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్, జనరల్ డ్యూటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జీఐపీఎంఈఆర్) అప్లికేషన్లను కోరుతున్నది. ఈ నియామకాలను ఒప్పంద ప్రాతిపదికన చేపడుతున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు (18): నెఫ్రాలజీ, రేడియోడయాగ్నోసిస్, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ గ్రేడ్–2, జనరల్ డ్యూటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్: ఆఫ్లైన్ అప్లికేషన్లను శ్రీ హవా సింగ్, రూమ్ నంబర్ –201, రెండో అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, జిప్మర్, పుదుచ్చేరికి పంపించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.