బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ జవాన్(Jawan). అట్లీ(Atlee) దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో.. దీపికా పాడుకొనే(Deepika padukone), నయనతార(Nayantara), విజయ్ సేతుపతి(Vijay sethupathi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పఠాన్(Pataan) వంటి బ్లాక్ బస్టర్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో జవాన్ టికెట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.
అయితే ఒక్కొక్కరు ఒక్క టికెట్ సంపాదించడం కోసమే తెగ కష్టపడుతుంటే.. ఒక అభిమాని మాత్రం తన అభిమాన హీరో సినిమా మొదటిరోజు చూసేందుకు ఏకంగా ఒక హాల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. అంతేకాదు ఆ హాల్ లో తనలాంటి 240 మంది షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కు ఫ్రీ గా టికెట్స్ అందిస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ మహ్మద్ అహ్మద్ హుస్సేన్ ఫారూఖీ. ఇతను ఫాట్ ఫుడీగా చాలా మందికి సుపరిచితమే.
తన ఫుడ్ వ్లాగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి మహ్మద్ అహ్మద్ హుస్సేన్ ఫారూఖీకి షారుఖ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఏ సినిమా ఐనా మొదటిరోజు చూడటం మహ్మద్ అహ్మద్ హుస్సేన్ ఫారూఖీకి అలవాటు. అయితే ఈసారి కాస్త కొత్తగా అతను మాత్రమే చూడకుండా.. తనలాంటి షారుఖ్ ఫ్యాన్స్ కూడా చూసేలా అరేంజ్ చేశారు. ఇందుకోసం ఎర్రమంజిల్ పీవీఆర్ లో ఒక హాల్ ను మొత్తం బుక్ చేసుకున్నాడు. అందులో మొత్తం 240 మందికి ఫ్రీ గా టికెట్స్ అందించనున్నాడు. ఫ్రీ టికెట్స్ పొందడానికి ఒక కాంటెస్ట్ ను కూడా రన్ చేశారు. అందులో విన్ అయినా 240 మంది షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా మొదటిరోజు చూడనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.