
బెంగళూరు: గ్రేస్ హారిస్ (4/15) హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీయడంతో యూపీ వారియర్స్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి విజయం సాధించింది. శనివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో 33 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడిన యూపీ 20 ఓవర్లలో 177/9 స్కోరు చేసింది. చినెల్లీ హెన్రీ (62) టాప్ స్కోరర్. తహ్లియా మెక్‌గ్రాత్ (24), కిరణ్ నవ్‌గిరె (17), దీప్తి శర్మ (13), ఎకిల్‌స్టోన్ (12) ఓ మాదిరిగా ఆడారు.
జెస్ జొనాసెన్ 4, కాప్, అరుంధతి రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 19.3 ఓవర్లలో 144 రన్స్‌కే ఆలౌటైంది. జెమీమా రొడ్రిగ్స్ (56), షెఫాలీ వర్మ (24)పోరాడినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్‌లో 34 రన్స్ కావాల్సిన దశలో హెన్రీ.. తొలి మూడు బాల్స్‌కు వరుసగా నికీ ప్రసాద్ (18), అరుంధతి రెడ్డి (0), మిన్ను మణి (0)ని ఔట్ చేసి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుంది.
ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా, ఆదివారం డబ్ల్యూపీఎల్‌కు సెలవు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీతో యూపీ పోటీ పడుతుంది.