
గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఈ విద్యాసంవత్సరం నుంచే ఏపీలో అమలు
అమరావతి, వెలుగు: ఇంటర్‌లో గ్రేడింగ్‌లతో పాటు మార్కులు కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత చదువులకోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌లో కొన్ని రాష్ట్రాలు ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ మార్కుల మెమోలలో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేశ్ తెలిపారు. మార్చి 4 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్ యాన్యువల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 20 రోజుల పాటు 1,411 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు.
For More News..