- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68.09 శాతం పోలింగ్
- మధ్యాహ్నం 12 గంటల నుంచి పోలింగ్ స్పీడప్
- మొత్తం ఓటర్లు 1,66,448 మంది
- ఓటు హక్కు వినియోగించుకున్న వారు 1,13,336 మంది
నల్గొండ, వెలుగు : నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఉపఎన్నికల పోలింగ్ప్రశాంతంగా ముగిసింది. అక్కడకక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్సవ్యంగానే సాగింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్మొదలు కాగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి స్పీడప్ అయ్యింది. మూడు జిల్లాల్లో కలిపి గ్రాడ్యుయేట్ఓటర్లు మొత్తం 1,66,4 48 మంది ఉండగా1,13,336 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో పురుషులు 1,06,574 మందికి 72,058 మంది, మహిళలు 59,874 మందికి 41,278 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడు జిల్లాల్లో కలిపి68.09 శాతం పోలింగ్ నమోదైంది.
మధ్యాహ్నం నుంచి పెరిగిన పోలింగ్..
ఉదయం 8 గంటల నుంచి మొదలైన పోలింగ్ ప్రక్రియ మొదటి రెండు గంటల వరకు కాస్తంత మందకొడిగానే సాగింది. 10 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్‌కేంద్రాలకు రావడం మొదలు పెట్టారు. ప్రధాన పట్టణాల్లో మాత్రం రిటైర్డ్ఉద్యోగులు ఉదయం పూటే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. యువకులు, నిరుద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిసి రావడం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి పోలింగ్పర్సంటేజీ 27 నుంచి 31 శాతానికి పెరిగింది. ఇక ఆ తర్వాత రెండు గంటలకోసారి పోలింగ్పెరగడం మొదలైంది. పోలింగ్సమయం ముగిసేవరకు నల్గొండ జిల్లాలో 66.75 శాతం, సూర్యాపేటలో 73.15 శాతం, యాదాద్రి జిల్లాలో 67.45 శాతం పోలింగ్‌నమోదైంది.
53 వేల మంది ఓటర్లు దూరం..
గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఎన్రోల్మెంట్పై చూపిన ఆసక్తి ఓటు వేయడంలో మాత్రం చూపలేదు. ఉమ్మడి జిల్లాలో 1.66 లక్షల మంది ఓటర్లు ఎన్రోల్కాగా, 53,112 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్ఓటు వినియోగించుకోవడంపై ఎన్నికల అధికారులు, పొలిటికల్పార్టీలు ఎంత ప్రచారం చేసినా ఓటర్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. ప్రధాన పట్టణాల్లో ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో పోలింగ్పర్సంటేజీ భారీగా పెరిగింది. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు సీరియస్‌గా తీ సుకున్న చోట పోలింగ్పర్సంటేజీ పెరిగినట్టు కనిపిస్తోంది.
జిల్లాలవారీగా పోలింగ్ వివరాలు..
జిల్లా పురుషులు మహిళలు శాతం
నల్గొండ 34,201 19,780 66.75
సూర్యాపేట 24,142 12,225 73.15
యాదాద్రి 13,715 9,273 67.45