మూడు రోజుల పాటు ‘గ్రాడ్యుయేట్‌‌‌‌’ లెక్కింపు

నల్గొండ, వెలుగు : ఈ నెల 5న జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌‌‌‌ ఏర్పాట్లపై రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, నల్గొండ కలెక్టర్‌‌‌‌ దాసరి హరిచందన శనివారం మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌‌‌‌ ప్రక్రియ మూడు రోజుల పాటు జరగనుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు చేపట్టే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆఫీసర్లకు వివరించారు.

96 టేబుళ్లు ఏర్పాట్లు

గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌‌‌‌ కోసం నల్గొండలోని దుప్పలపల్లి గోడౌన్‌‌‌‌లో 4 హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో హాల్‌‌‌‌లో 24 టేబుల్స్‌‌‌‌ చొప్పున ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఒక్కో టేబుల్‌‌‌‌కు ఒక్కో క్యాండిడేట్‌‌‌‌ ఒక ఏజెంట్‌‌‌‌ను నియమించుకోవాలి. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌ టేబుల్ వద్ద ఒక ఏజెంట్‌‌‌‌ను గానీ, క్యాండిడేట్‌‌‌‌ను గానీ ఉండడానికి అనుమతి ఇస్తారు.

క్యాండిడేట్లు, ఏజెంట్ల ముందే బ్యాలెట్‌‌‌‌ బాక్స్‌‌‌‌ సీల్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేయనున్నారు. క్యాండిడేట్లు గానీ, ఏజెంట్లకు గానీ ఇంకు పెన్నులు, వాటర్‌‌‌‌ బాటిళ్లు, సెల్‌‌‌‌ఫోన్స్‌‌‌‌ అనుమతించరు. 12 టేబుళ్లకు ఒక ఆర్డీవోను ఇన్‌‌‌‌చార్జిగా, ప్రతి హాల్‌‌‌‌కు అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌, ఒక ఏఆర్‌‌‌‌వో ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరించనున్నారు. కౌంటింగ్‌‌‌‌లో పాల్గొనే సిబ్బందికి సోమవారం మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు.

ఫస్ట్‌‌‌‌ షిఫ్ట్‌‌‌‌ డ్యూటీలో ఉన్న వారు రెండో షిఫ్ట్‌‌‌‌ సిబ్బంది వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మూడు రౌండ్ల వరకు బండిల్స్‌‌‌‌ లెక్కించడం జరగనుంది. చెల్లుబాటు అయ్యే ఓట్లు, కాని ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్‌‌‌‌ ఆఫీసర్లకు సూచించారు.