పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గౌడన్స్ లో జూన్ 5వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.  నాలుగు హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ కౌంటింగ్ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 2 వేల 100 మంది సిబ్బంది కేటాయించారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 3 లక్షల 36 వేల13 ఓట్లు పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికలో  మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ల మధ్యే తీవ్ర పోటీ ఉంది.

కాగా, జూన్  4న వెల్లడించిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు, బీజేపీ పార్టీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుకున్నాయి. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానంలో అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది.