![త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్!](https://static.v6velugu.com/uploads/2021/02/mlc-elections.jpg)
- రేపు జరిగే మీటింగ్‌లో ఎన్నికలపై నిర్ణయం
- ఎలక్షన్ కోడ్ వస్తదనే సాగర్‌లో సీఎం వరాలు
హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ త్వరలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. వచ్చే నెల 29న గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రారావు.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిల టర్మ్ ముగియనుంది. ఇప్పటికే ఈ స్థానాలకు గ్రాడ్యుయేట్ఓటర్ల లిస్ట్‌ను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. సీఈసీ ప్రతి శుక్రవారం ఆర్ఓలతో రివ్యూ నిర్వహిస్తుంది. దీంతో రేపు జరిగే మీటింగ్‌లో ఈ రెండు స్థానాలకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్.. హాలియాలో ధన్యవాద సభ పెట్టి, ముందస్తుగా వరాల జల్లు కురిపించారని ప్రచారం జరుగుతోంది. వారం రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని సీఎం కొత్త కానుకలు ప్రకటించినట్లు సమాచారం. ఆ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పల్లా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.
For More News..
కేసీఆర్ కుటుంబీకులు రూ. 25 లక్షల జీతం తీసుకుంటున్నరు
కేసీఆర్ పాలనపై హైదరాబాద్‌లో మాట్లాడుతా
కొత్త ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు