సీఎంను కలిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

సీఎంను కలిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్, మెదక్, -నిజామాబాద్,- -ఆదిలాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్  పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు  తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు, కృషి చేసిన టీపీసీసీ చీఫ్​ మహేశ్  కుమార్ గౌడ్, సహకరించిన  మంత్రుల  బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. 

డిప్యూటీ  సీఎం భట్టివిక్రమార్క, ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు  పొన్నం  ప్రభాకర్, శ్రీధర్ బాబు,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి,  దామోదరరాజనర్సింహ,  జూపల్లికృష్ణారావు,  సీతక్క,కొండసురేఖలను మర్యాదపూర్వకంగా  కలిశారు.