ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సన్మానం

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సన్మానం

నిర్మల్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను నిర్మల్ జిల్లా పీఆర్టీయూ తెలంగాణ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. సోమవారం నల్గొండ జిల్లాలో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జిల్లా నేతలు మల్లన్నను సన్మానించి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

 టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మల్లన్న వారికి హామీ ఇచ్చారు. పీఆర్టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గాలి హర్షవర్ధన్ రెడ్డి, అధ్యక్షుడు ఉమాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న, ప్రధాన కార్యదర్శి చక్రాల హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు బామాండ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.