- 3.41 లక్షల మంది నమోదు
- మేల్ గ్రాడ్యుయేట్స్ 2,18,060, ఫిమేల్ గ్రాడ్యుయేట్లు 1,23,250
- అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1,62,464 మంది
- గత ఎన్నికల టైంలో అప్లై చేసింది 1.96 లక్షల మందే
- కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 25,921 మంది
కరీంనగర్, వెలుగు : ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 2019 ఎన్నికల్లో 1.96 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకోగా.. ఈ సారి రెండు విడతల్లో 3,41,313 మంది ఎన్ రోల్ చేసుకున్నారు. వీరిలో 2,18,060 మంది మేల్ గ్రాడ్యుయేట్స్ ఉండగా, ఫిమేల్ గ్రాడ్యుయేట్లు 1,23,250 మంది, థర్డ్ జెండర్ గ్రాడ్యుయేట్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 25,921 మంది నమోదు చేసుకున్నారు. వీరిలో పురుషులు 16,364 మంది, స్త్రీలు 9,557 మంది ఉన్నారు.
45 శాతం మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే..
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఓటరు నమోదుకు సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు అవకాశం కల్పించారు. డిసెంబర్ లో మరో చాన్స్ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన 15 జిల్లాల పరిధిలోని 271 మండలాల్లో ఎన్ రోల్ మెంట్ జరిగింది. ఎమ్మెల్సీ క్యాండిడేట్లుగా పోటీ చేయాలనుకుంటున్న వారు ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ నిర్వహించారు. ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేసి.. గ్రాడ్యుయేట్ల నుంచి డిగ్రీ మెమో, ప్రొవిజనల్స్, ఓటరు ఐడీ సేకరించి ఆన్ లైన్ లో అప్లై చేయించారు.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 1,62,464 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 46,409 ఓటర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 67,738 మంది, ఉమ్మడి మెదక్ జిల్లాలో 64,702 మంది నమోదయ్యారు. కొత్త జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా 69,657 మంది ఓటర్లతో కొత్త కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. 2,420 మందితో జయంశంకర్ భూపాలపల్లి జిల్లా(కాటారం, మల్హర్ రావు, మహాదేవ్‌పూర్, పలిమెల, ముత్తారం మండలాలు) చివరి స్థానంలో ఉంది.
టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 25,921 మంది..
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 25,921 మంది టీచర్లు అప్లై చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 4,020 మంది ఉండగా, నిజామాబాద్ జిల్లాలో 3,529 మంది, సిద్ధిపేట జిల్లాలో 3,052 మంది నమోదు చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి తక్కువగా 81 మంది నమోదు చేసుకున్నారు.
జిల్లా టీచర్లు గ్రాడ్యుయేట్లు
కుమ్రంభీం అసిఫాబాద్ 457 5855
మంచిర్యాల 1550 30,488
ఆదిలాబాద్ 1561 14,586
నిర్మల్ 1944 16,809
నిజామాబాద్ 3,529 30,593
కామారెడ్డి 2,061 15,816
జగిత్యాల 1706 34,281
పెద్దపల్లి 1,059 30,069
కరీంనగర్ 4,020 69,657
రాజన్న సిరిసిల్ల 874 21,614
సంగారెడ్డి 2,588 21,203
మెదక్ 1,281 11,953
సిద్ధిపేట 3,052 31,546
హనుమకొండ 158 4,423
జయశంకర్ భూపాలపల్లి 81 2,420
మొత్తం 25,921 3,41,313