
హుజూరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు గ్రాడ్యుయేట్లు ఎప్పుడో ఫిక్స్ అయ్యారని, పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలుపు ఖాయమని రాష్ట్ర లైబ్రరీ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. శనివారం హుజూరాబాద్ పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కేసీఆర్ ఒడిసిన ముచ్చట అని, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వ్యక్తుల మధ్య కాకుండా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే జరుగుతున్నట్లు భావించాలన్నారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రణవ్ మాట్లాడుతూ పదేళ్లలో పట్టభద్రులకు బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు.
నరేందర్‌రెడ్డిని గెలిపించండి
వేములవాడ రూరల్, వెలుగు : వేములవాడ రూరల్ పార్టీ ఆఫీసులో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్ గౌడ్ మాట్లాడుతూ నరేందర్‌రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కోరుట్ల, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి విజయం కోసం పార్టీ లీడర్లు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కోరుట్లలోని జువ్వాడి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ గతంలో జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించామని అదేవిధంగా ఈ ఎన్నికల్లోనూ నరేందర్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. ఈ నెల 24న నిజామాబాద్‌లో జరిగే సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని, గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో
తరలిరావాలని పిలుపునిచ్చారు.
సుల్తానాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే విజయ రమణారావు శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్స్ ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.