హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై గురువారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. 2023 నవంబర్ ఒకటి నాటికి మూడేండ్ల ముందు డిగ్రీ, డిప్లొమా ఉన్న గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. గుర్తుంపు పొందిన విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు అర్హులని చెప్పారు.
ఫిబ్రవరి 24l డ్రాఫ్ట్ ప్రచురిస్తామని , ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి మార్చి 14 వరకు అందజేయాలని తెలిపారు. ఫైనల్ లిస్ట్ ఏప్రిల్ 4న విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, వివిధ పార్టీల ప్రతినిధులు ఈవీ.శ్రీనివాసరావు, రావు అమరేందర్ రెడ్డి, ఎం.మణి, గొడుగు వెంకట్, సయ్యద్ ఫైజుల్లా, శ్యామ్ సుందర్, రజినీకాంత్ పాల్గొన్నారు.