కాంగ్రెస్ శ్రేణుల్లో సంకల్ప సభ జోష్ .. తొలిసారి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి

కాంగ్రెస్ శ్రేణుల్లో సంకల్ప సభ జోష్ .. తొలిసారి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి

కరీంనగర్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో సోమవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభ సక్సెస్ అయింది. సభకు గ్రాడ్యుయేట్లు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం హోదాలో తొలిసారిగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. వేదికపై కళాకారుల ఆటాపాటలు అలరించాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి సభికుల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ వేదికగా తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ప్రకటన, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దేశానికి సేవ చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా)తోపాటు చొక్కారావు, ఎమ్మెస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. సభ పూర్తయ్యే వరకు జనం కదల్లేదు. 

కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, విప్‌‌‌‌‌‌‌‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం, భానుప్రసాద్,  ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకట్ రెడ్డి, కోడూరి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వేంకటేశ్వర స్వామి ప్రతిమతో కూడిన జ్ఞాపికను అందజేశారు. 

30 ఏళ్లుగా మీలో ఒకడిగా ఉన్నా.. 

‘30 ఏళ్లుగా ఇక్కడ మీలో ఒకడిగా ఉన్నాను. ట్యూషన్ సెంటర్ నుంచి తాను ఈ స్థాయికి ఎదిగాను. పోటీలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ గడ్డ మీద రూపాయి పెట్టినోళ్లు కాదు. ఏ ఒక్కరికి ఎంప్లాయ్ మెంట్ ఇచ్చినోళ్లు కాదు. నేను అల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి కల్పించాను. ఇక మీదట గ్రాడ్యుయేట్లకు, నిరుద్యోగులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను.  శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్, లా కాలేజీ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు. ప్రచారంలో భాగంగా అనేక వర్గాల సమస్యలు తెలుసుకున్నా. వాటి పరిష్కారానికి కృషి చేస్తా. సొంత నిధులతో ప్రైవేట్ టీచర్లకు ఇన్సూరెన్స్ కల్పిస్తా. కరీంనగర్ లో ఏ ఇల్లు చూసినా ఒక అల్ఫోర్స్ విద్యార్థి ఉంటాడు. మీరంతా నా సైన్యమని భావిస్తున్నా.’

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి