వరంగల్ నిట్ స్నాతకోత్సవం చీఫ్ గెస్ట్ గా డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ

కాజీపేట, వెలుగు: వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)22వ స్నాతకోత్సవం శనివారం ఉదయం జరగనుంది. చీఫ్ గెస్ట్ గా డైరెక్టరేట్ ఆఫ్ డిపెన్స్​సెక్రటరీ సమీర్ వి. కామత్ హాజరవుతుండగా..  నిట్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సెమినార్​ హాల్ లో ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ హాల్ లో ఉదయం 10 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభం కానుందని తెలిపారు. నిట్ లో హెల్త్ సెంటర్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా 1,875 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. 

బీటెక్ లో 949, ఎంటెక్ లో 539, పీహెచ్ డీలో 147 , ఎంఎస్సీలో 154, ఎంబీఏలో 22 , ఎంసీఏలో 55 మంది ఉన్నారని వివరించారు.  కొత్తగా పీజీ, పీహెచ్​డీ కోర్సుల్లో టాపర్ గా నిలిచిన మనీషా వర్షినికి, అరుణ్​కుమార్ కు తొలిసారిగా గోల్డ్ మోడల్స్ ఇస్తున్నట్టు చెప్పారు.  మరో 9 మందికి  డిగ్రీలు జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిట్ అకడమిక్ డీన్ శరత్ బాబు , నిట్ పీఆర్వో రాహుల్ పాల్గొన్నారు.