Graham Thorpe: కెరీర్‌లో 100 టెస్టులు.. 55 ఏళ్లకే ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

ఇంగ్లాండ్ క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. మాజీ బ్యాటర్.. దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ సోమవారం ఉదయం (ఆగస్టు 5) మరణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక పత్రికా ప్రకటనలో అతను మరణించినట్లు తెలిపింది. అతని వయసు 55 సంవత్సరాలే కావడం గమనార్హం. థోర్ప్ మరణించారనే దిగ్భ్రాంతికరమైన ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.   

1969లో జన్మించిన థోర్ప్.. 1993లో ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేశాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్ కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఇతను ఒకడు. వీటితో 82 వన్డేలను ఆడాడు. మొత్తం 16 సెంచరీలతో పాటు 9000 పైగా పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్రే తరపున కౌంటీ మ్యాచ్ ల్లో 49 సెంచరీలు.. 45.04 సగటుతో 21,937 పరుగులు చేశాడు. ఈ లెజెండ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ తో పాటు సర్రే క్రికెట్ కౌంటీ కూడా నివాళులర్పించింది.