లండన్ : ఇటీవల మృతి చెందిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌ది సహజ మరణం కాదని, తను సూసైడ్ చేసుకున్నాడని అతని భార్య అమండా వెల్లడించింది. థోర్ప్ ఈ నెల 5న అనారోగ్య కారణాలతో చనిపోయాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. అయితే, థోర్ప్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నది నిజమే అయినా అతను ఆత్మహత్యకు పాల్పడ్డారని అమండా తెలిపింది.
‘థార్ఫ్ ఆరోగ్యం రెండేండ్లుగా మరింత క్షీణించింది. చాన్నాళ్ల నుంచి శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బంది పడ్డారు. నేను, మా ఇద్దరు అమ్మాయిల ఎంత ప్రేమ చూపెట్టిన ఆయన ఆరోగ్యం మెరుగవ్వలేదు. తాను చనిపోతేనే మేం సుఖంగా ఉంటారని భావించి సూసైడ్ చేసుకున్నాడు' అని అమండా ఓ ఇంటర్వ్యూలో
చెప్పుకొచ్చింది.