మూడింట ఒకవంతు మిల్లర్లు డిఫాల్టర్లే

మూడింట ఒకవంతు  మిల్లర్లు డిఫాల్టర్లే
  • ఉమ్మడి జిల్లాలో ఎగవేతదారుల జాబితాలో 172 మంది రైస్ మిల్లర్లు
  • రూ.కోట్లల్లో బకాయిలు, పెనాల్టీలు 
  • డిఫాల్టర్లను పక్కన పెట్టి  మిగతా మిల్లులకు ధాన్యం కేటాయింపులు
  • మిల్లర్ల అండర్ టేకింగ్ తో ప్రారంభమైన వడ్ల కొనుగోళ్లు

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత నాలుగేండ్లలో  ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సీఎంఆర్ అప్పగించకుండా డిఫాల్టర్లుగా తేలిన రైస్ మిల్లర్లను పక్కన పెట్టి, ఎలాంటి బకాయిల్లేని, బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించేందుకు ఆఫీసర్లు నిర్ణయించారు.

 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి బకాయిల చరిత్ర లేని మిల్లర్లు, మిల్లింగ్ సామర్థ్యంపై 10 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పెట్టిన కండిషన్ కొందరు మిల్లర్లకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను అంగీకరించి బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లర్ల నుంచి  అండర్ టేకింగ్ తీసుకుని ఆయా మిల్లర్ల మిల్లింగ్ కెపాసిటీని బట్టి ధాన్యం కేటాయిస్తున్నారు.  

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో డిఫాల్టర్లు 71 మంది 

కరీంనగర్ జిల్లాలో మొత్తం 210 మంది రైస్ మిల్లర్లు ఉండగా 71 మంది గత నాలుగేళ్ల  కాలంలో బకాయిపడినవారే కావడం గమనార్హం. 2019–20 లో 12 మంది, 2020–-21 లో ఒకరు, 2021–-22లో 58 మంది కలిపి మొత్తం 71 మంది మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలగా.. అందులో 40 మంది మాత్రం ఎక్కువ మొత్తంలో బకాయిపడినట్లు సమాచారం. ఇందులోనూ 10 మంది వరకు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు బకాయిపడినట్లు తెలిసింది. 

ఎలాంటి బకాయిల్లేని 110 మంది మిల్లర్లు ప్రభుత్వ గైడ్ లైన్స్  ప్రకారం వడ్లను మరాడిస్తామని అండర్ టేకింగ్ ఇవ్వడంతో వారికి ధాన్యం కేటాయింపులు చేశారు.  మరో 30 మంది మిల్లర్లు ఒకటి, రెండు రోజుల్లో ధాన్యం కేటాయించనున్నట్లు తెలిసింది. డిఫాల్టర్లలో మెజార్టీ మిల్లర్లు బకాయి డబ్బులు చెల్లించినప్పటికీ.. పెనాల్టీ అమౌంట్ మాత్రం పెండింగ్ లో ఉన్నట్లు కరీంనగర్ సివిల్ సప్లై డీఎం రజనీకాంత్ వెల్లడించారు.

సిరిసిల్లలో 31 మందికి నోటీసులు 

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో 107 రైస్ మిల్లులు ఉండగా సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగవేసిన 31 మంది రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ చేసి డిఫాల్టర్ గా  ప్రకటించారు. ప్రస్తుతం 76మంది రైస్ మిల్లర్లు నుంచి అండర్ టేకింగ్ తీసుకొని ధాన్యం కేటాయిస్తున్నారు. 

జగిత్యాలలో రూ.20కోట్ల సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

జగిత్యాల: జిల్లాలో 114 మంది రైస్ మిల్లర్లు ఉండగా.. వీరిలో 10 మంది రైస్ మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించారు. వారి వద్ద సుమారు రూ. 20 కోట్ల విలువైన వరకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 65 మిల్లర్లు ఫెయిర్ గా ఉన్నట్లు గుర్తించిన ఆఫీసర్లు వారికి ధాన్యం కేటాయిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదని ఆఫీసర్లు వెల్లడించారు. 

పెద్దపల్లిలో 60 మంది డిఫాల్టర్లు.. 

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో సీఎంఆర్ ఎగవేసిన జాబితాలో 20 పారా బాయిల్డ్ రైసు మిల్లులు, 40 రా రైస్ మిల్లులు ఉన్నాయి. సివిల్ సప్లై ఆఫీసర్లు ఆయా మిల్లుల యాజమాన్యాలకు పెనాల్టీ వేసి, నోటీసులు అందజేయగా బకాయి చెల్లించినా, పెనాల్టీ చెల్లించలేదు. ప్రస్తుతం ఈ పెనాల్టీలకు బ్యాంకు గ్యారంటీలు ఇస్తే.. తిరిగి వడ్లు కేటాయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే సీఎంఆర్ పూర్తిగా చెల్లించని 5 మిల్లులను బ్లాక్ లో పెట్టినట్టు అధికారులు వివరించారు.