ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో సక్సెస్ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వడ్ల కొనుగోళ్లు

  • ఇప్పటివరకు 7.78 లక్షల మెట్రిక్​ టన్నుల సేకరణ 
  •  దీనిలో సన్న రకాలు 4,07 లక్షల మెట్రిక్​ టన్నులు
  •  రైతుల ఖాతాల్లో రూ.1848 కోట్లు జమ
  •  సన్నాలకు బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో రూ. 81. 55 కోట్లు 
  •  ఏరోజుకారోజు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ 

పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ధాన్యం సేకరణ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతోంది. ఎలాంటి తరుగు, తప్ప తాలు కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకుండా సజావుగా కొనుగోళ్లు జరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు వరి ధాన్యం 7.78 లక్షల మెట్రిక్​ టన్నులు వడ్లు కొనుగోలు పూర్తయింది. 

ఇందులో సన్న రకం 4.07 లక్షల మెట్రిక్​ టన్నులు ఉంది. ఈ ధాన్యానికి సంబంధించి రూ.1848 కోట్లు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమయ్యాయి.  ప్రభుత్వం ప్రకటించిన సన్నాలకు బోనస్​ రూపంలో రూ. 81.55 కోట్లు రైతుల అకౌంట్లలో పడ్డాయి. ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు ఆన్​లైన్​ చేస్తుండడంతో ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు జమవుతన్నాయి. 

ఈసారి ‘బోనస్’​ వడ్లు 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి సన్నాల సాగు పెరిగింది. ప్రభుత్వం బోనస్​ ప్రకటించడంతో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్​జిల్లాల్లో సన్నాలు ఎక్కువగా సాగు చేయగా.. జగిత్యాల, సిరిసిల్లలో దొడ్డు రకం సాగు చేశారు. జగిత్యాల జిల్లాలో 2.54 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొనగా.. అందులో 60 వేల మెట్రిక్​ టన్నుల సన్నాలు ఉన్నాయి. కరీంనగర్​ జిల్లాలో 2.23 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా , అందులో సన్నాలు 1.55 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నులు, పెద్దపల్లి జిల్లాలో  కొన్న 2.03లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల వడ్లలో సన్నాల వాటా 1.47 లక్షల మెట్రిక్​ టన్నులుగా నమోదయ్యాయి.

 రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.98 లక్షల మెట్రిక్​ టన్నులకు అందులో 46 వేల మెట్రిక్​ టన్నుల సన్నాలు కొన్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 1,845 కోట్లు కాగా.. పెద్దపల్లి జిల్లాలో రూ. 420 కోట్లు, కరీంనగర్​ రూ. 492 కోట్లు, జగిత్యాలలో రూ. 520 కోట్లు, రాజన్న సిరిసిల్ల రూ. 414  కోట్లు రైతుల అకౌంట్లలో పడ్డాయి. 

కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకుండా కొనుగోళ్లు

కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకుండా వడ్ల కొనుగోళ్ల చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో సజావుగా కొనుగోళ్లు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. గతంలో తరుగు, తాలు పేరుతో క్వింటాకు 5 నుంచి 7 కేజీలో కటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టేవారు. ప్రస్తుతం బస్తాను 41 కేజీల తూకం వేస్తూ కొంటున్నారు. 

గతంలో ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్ కూడా ఇవ్వకపోగా.. ఇప్పుడు వడ్లు మిల్లుకు చేరగానే రైతుల చేతిలో ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటోంది. డబ్బులు కూడా రెండు రోజుల్లోపే పడుతుండడంతో రైతులు హర్షం 
వ్యక్తం చేస్తున్నారు. 


కాంటా పెట్టిన రెండ్రోజులకే పైసలు పడ్డయి

వడ్లు కాంటా పెట్టిన రెండ్రోజులకే నా ఖాతాలో పైసలు పడ్డయి. ఎటువంటి కోతలు లేకుండా వడ్లు కొంటున్నరు. గతంలో కాంటా అయినంక నెల దాకా పైసలు పడేవి కాదు. ఇప్పుడు వడ్ల డబ్బులతో పాటు బోనస్​ కూడా పడుతుండడంతో చాలా సంతోషంగా ఉంది. కటుకం రాజలింగు, రైతు, ఖమ్మంపల్లి, పెద్దపల్లి