పెన్‌పహాడ్/చండూరు/హుజూర్‌నగర్, వెలుగు : తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ సిబ్బందిని గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్, హుజూర్‌నగర్, నల్గొండ జిల్లా చండూరు, గట్టుప్పల ఎంపీడీవో ఆఫీస్‌ల ఎదుట ఒక రోజు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవో నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, గ్రాట్యుటీతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 19 వేలు ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 10 లక్షలు చెల్లించాలని కోరారు. అధికారంలోకి రాగానే జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పెన్‌పహాడ్‌లో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రణపంగ వెంకన్న, కార్మికులు నకిరేకంటి నరసయ్య, శ్రీనివాస్, ఒగ్గు మట్టయ్య, ఒగ్గు నరేశ్, కట్టోజు శ్రవణ్, సిలివేరు సైదులు చండూరు,
గట్టుప్పల్‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, నాయకులు మొగుదాల వెంకటేశం, జెర్రిపోతుల ధనుంజయగౌడ్, ఏర్పుల సైదులు, చిట్టిమల్ల లింగయ్య, హుజూర్‌నగర్‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను, కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు షేక్ అసానిమియా, వెంకట్‌రెడ్డి, కస్తల నాగరాజు, కొండలు, ఎల్లమ్మ పాల్గొన్నారు.