మహబూబ్ నగర్ జిల్లాలో అర్హులందరికీ పథకాలు .. లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన అధికారులు

మహబూబ్ నగర్ జిల్లాలో అర్హులందరికీ పథకాలు .. లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన అధికారులు
  • నాలుగు సంక్షేమ పథకాల అమలుపై గ్రామసభల నిర్వహణ 
  • జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందొద్దు
  • ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్ 
  • జనవరి 24 వరకు కొనసాగనున్న సభలు 

వెలుగు, నెట్ వర్క్:  జనవరి 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేయనుండగా.. దీనికి సంబంధించి మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో  గ్రామ సభలు నిర్వహించారు.  ఈ సభల్లో సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు.  ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు  చేసుకున్న వారి వివరాలను  ఈ నెల 16 నుంచి 20 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని నిరుపేదలకు రూ. 12 వేలు, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాల అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశారు.  

  • వనపర్తి జిల్లాలోని  ఖిల్లాగణపురం మండలంలోని ఉప్పరిపల్లి, ముందరి తండా గ్రామాల్లో జరిగిన గ్రామ సభలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో  పాటు  కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు, అనర్హులు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను ప్రజల సమక్షంలో తెలుసుకోడానికి  ఈ నెల 24  వరకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నామన్నారు.  ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పార్టీలకతీతంగా, పారదర్శకంగా అర్హుడైన  లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
  • అర్హులందరికీ పథకాలు వస్తాయని ఎవరూ ఆందోళన చెందొద్దని ఇదో నిరంతర ప్రక్రియ అని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అన్నారు. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని  ఏడో వార్డు అశోక్ నగర్ లో  ప్రజా ప్రభుత్వ ప్రజాపాలన వార్డు సభను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. 

జాబితాలో పేరు రాని వాళ్లు ఆందోళన చెందొద్దు 

  • రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు , రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా పథకాల జాబితాలో పేర్లు రానివాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.  మంగళవారం మహబూబ్ నగర్  రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామంలో గ్రామసభ ప్రారంభించారు.  గతంలో దరఖాస్తులు ఇచ్చి, జాబితాలో పేర్లు రానివారు ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వవచ్చని ఆమె స్పష్టం చేశారు.  మూసాపేట మండలం చక్రపూర్ గ్రామంలో  కలెక్టర్ విజయేంద్ర  బోయి గ్రామ సభలో  పాల్గొని మాట్లాడారు.  సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆమె తెలిపారు.
  • అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు అందించడం అనేది నిరంతర ప్రక్రియ అన్నారు.  క్షేత్రస్థాయిలో ఇదివరకే పరిశీలన చేసి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు లబ్ధిదారుల లిస్టును విడుదల చేయడం జరిగిందన్నారు. 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల స్కీంలు అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి  అహర్నిశలు కృషి చేస్తున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఉప్పునుంతల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభకు ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  లిస్టులో పేరు లేని వాళ్లుఎలాంటి భయాందోళన చెందవద్దని ఆయన సూచించారు. అధికారులు ప్రతి ఒక్కరి పేరు నమోదు చేసుకొని రికార్డు తయారు చేస్తారన్నారు.