Post Office Schemes: పోస్టాఫీస్ స్కీమ్‌.. రోజుకు రూ.50 పొదుపుతో రూ.35 లక్షలు!

కుటుంబ ఆర్థిక భద్రత గురించి ఆలోచిస్తున్నారా?, వయసు మీద కొచ్చాక రిస్క్ లేకుండా మంచి రాబడి పొందే మార్గాలు అన్వేషిస్తున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ పథకం గురించి కాస్త తెలుసుకోండి. గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియా పోస్ట్.. 1955లో గ్రామ్ సురక్ష పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ అన్నమాట. 

ఈ స్కీమ్‌లో చేరిన వారు లేదా బీమా చేసిన వ్యక్తికి 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత బోనస్‌తో కూడిన హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ సమయంలో బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందిస్తారు. 

కనిష్ట బీమా మొత్తం రూ.10 వేలు

19 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న వారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. కనిష్ట హామీ మొత్తం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల మొత్తానికి బీమా పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం ను నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాదికోసారి చెల్లించే వెసులుబాటు ఉంది. ప్రీమియం చెల్లింపుకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంది.

55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతంఈ పాలసీ తీసుకున్న వారికి ఏడాదికి ప్రతి రూ.1000కు రూ.60 బోనస్ ఇస్తున్నారు. 36 నెలల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు. 5 ఏళ్ల లోపు పాలసీ సరెండర్ చేస్తే బోనస్ కు అర్హులు కారు

రుణ సదుపాయం

పాలసీ తీసుకున్న 4 సంవత్సరాల తరువాత రుణ సదుపాయం పొందవచ్చు. రుణంపై వడ్డీ రేటు 10%గా ఉంది. సెక్షన్ 80C, సెక్షన్ 88 కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

రూ.35 లక్షలు

ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారనుకుంటే.. 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.31.6 లక్షలు పొందవచ్చు. అదే 58 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.33.4 లక్షలు, 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.34.6 లక్షల మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అందుతాయి. అందుకుగాను చెల్లించాల్సిన ప్రీమియం విషయానికొస్తే.. 55 ఏళ్లకు రూ.1515, 58 ఏళ్లకు రూ.1463, 60 ఏళ్లకు రూ.1411 పడుతుంది. అంటే రోజుకు రూ.50 చొప్పున ఆదా చేస్తే సరిపోతుంది. వయసు మీద కొచ్చాక ఆర్థికంగా చేదోడుగా ఉండాలంటే ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.

ALSO READ :- పొరపాటున డీజిల్ కారులో పెట్రోల్ నింపితే?..ఇంజిన్కు డ్యామేజే..అలా కాకుండా ఉండాలంటే