భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మున్సిపాల్టీలో గ్రామసభలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మున్సిపాల్టీలో గ్రామసభలు

తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.  ఈ నెల 24 వరకు జరుగనున్నాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఆరు వార్డులలో.. మండలంలోని  12 గ్రామపంచాయితీ లలో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు.  ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు..ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్నా  లబ్దిదారుల జాబితాలో  పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.