మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వార్డు సభలను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పై సర్వే చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్ లు వస్తాయని ఎవరు అదర్యపడద్దని మున్సిపల్ చైర్ పర్సన్ చెక్కుల శ్వేత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో నాలుగు రోజుల పాటు జరిగే గ్రామ సభలను పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డుల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సభలు నిర్వహించేందుకు గ్రామ, వార్డు, డివిజన్ కు ఒకరి చొప్పున నియమించారు. ప్రజలు రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకుంటున్నారు...