
ప్రభుత్వ పథకాల అమలు కోసం జగిత్యాల జిల్లాలోని పలు గ్రామసభలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో విడుదల చేస్తున్నామన్నారు. అనర్హులుంటే గుర్తించి చెబితే నమోదు చేసుకుంటామని తెలిపారు. అర్హులై ఉండి పేరు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన వారు మండల కేంద్రాల్లో గాని కలెక్టరేట్లో కానీ తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కలెక్టర్ అన్నారు.