
గూగుల్ సెర్చ్‌లో యూజర్ల కోసం కొత్తగా గ్రామర్ చెక్ ఫీచర్ తీసుకొచ్చింది ఆ కంపెనీ. ఇప్పటికైతే ఇది ఇంగ్లిష్ భాషకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో మరిన్ని భాషల్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ గ్రామర్ చెక్ ఫీచర్ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఒక వాక్యంలో వ్యాకరణం సరిగా ఉందా? లేదా? అనేది ఈ ఫీచర్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. దీన్ని వాడడం కూడా చాలా ఈజీ. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి ఇంగ్లిష్‌లో ఒక వాక్యం రాయాలి. తరువాత గ్రామర్ చెక్, చెక్ గ్రామర్ లేదా గ్రామర్ చెకర్ అని టైప్ చేయాలి.
దాంతో వెంటనే రాసిన వాక్యంలో వ్యాకరణాన్ని చెక్ చేసి చెప్తుంది. సరిగా ఉంటే గ్రీన్ చెక్ మార్క్ కనిపిస్తుంది. తప్పుగా ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది. అంతేకాకుండా లోపాలు ఉంటే గూగుల్ ఆ వాక్యాన్ని సరిచేసి, దిద్డిన పదాలను హైలైట్ చేస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని కూడా సాల్వ్ చేస్తుంది. గూగుల్ గ్రామర్ చెక్ ఫీచర్‌ను డెస్క్‌టాప్, మొబైల్ ఫోన్లలో వాడొచ్చు.