విషాదం.. కార్ యాక్సిడెంట్ లో ప్రముఖ పాప్ సింగర్ మృతి..

విషాదం.. కార్ యాక్సిడెంట్ లో ప్రముఖ పాప్ సింగర్ మృతి..

గ్రామీ-నామినేట్ R&B సింగర్ ఆంజీ స్టోన్ శనివారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ వాల్టర్ మిల్‌సాప్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఓ ప్రోగ్రాం నిమిత్తం అలబామా నుండి అట్లాంటాకు ప్రయాణిస్తున్న సమయంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్ ని ఢీ కొట్టింది. దీంతో స్థానికులు వెంటనే హైవే అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదనికి గురైన వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ సింగర్  ఆంజీ స్టోన్ కి తీవ్రమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. 

ఈ విషయం ఇలా ఉండగా 63 ఏళ్ళ వయసున్న ఆంజీ స్టోన్ "విష్ ఐ డిడ్ నాట్ మిస్ యు" అనే పాటతో బాగా పాపులర్ అయింది. ఆంజీ స్టోన్ హిప్-హాప్ గ్రూప్ ఫంకీ ఫోర్ ప్లస్ వన్‌కు చెందిన లిల్ రోడ్నీ సి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన కుటుంబంతో కలసి అట్లాంటా లో నివాసం ఉంటోంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆంజీ స్టోన్ కన్ను మూయడంతో ఆమె కుటుంబం ఒక్క్కసారిగా తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు ఆంజీ స్టోన్ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.