తిమ్మాపూర్,వెలుగు: ఎల్ఎండీ కాలనీలోఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఆలయ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏటా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు దాతలు విరాళాలు అందజేయాలని కోరారు. ఆలయకమిటీ సభ్యులు మారం జగదీశ్వర్, మోహన్ రెడ్డి, లక్ష్మణరావు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్, వివిధ సంఘాల లీడర్లు పోలు కిషన్, మామిడి రమేశ్, సభ్యులు పాల్గొన్నారు.