ఆదివారం ( డిసెంబర్ 1, 2024 ) జరగనున్న మాలల సింహగర్జనకు భారీ ఏర్పాట్లతో సిద్ధమైంది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి మాలలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కార్లు,బస్సులు,బైక్ లతో ర్యాలీలుగా సింహగర్జన సభకు తరలివస్తున్నారు.
200మంది అతిథులు కూర్చునేలా వేదిక ఏర్పాటు చేశారు. ఈ సభకు తెలంగాణ, ఏపీ నుంచి పెద్దఎత్తున మాలలు తరలిరానున్నారు. ఈ మీటింగ్ ను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, మాలమహానాడు ప్రెసిడెంట్ చెన్నయ్య కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నేతలతో మీటింగ్ లు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు.
మాలలు పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయాలని.. ఈ సభ ద్వారా మాలల ఐక్యత చాటి చెప్పాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వివేక్. ఇది హక్కుల కోసం నిర్వహిస్తున్న మీటింగ్ తప్ప.. ఎవ్వరికీ వ్యతిరేకం కాదన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మాలల్లో యూనిటీ వచ్చిందని.. రానున్న రోజుల్లో ఐక్యత కొనసాగించాలన్నారు వివేక్ వెంకట స్వామి. రాష్ట్రంలో ఉన్న 30లక్షల మంది మాలలు ఉన్నారని..మీటింగ్ తో తమ సత్తా చూపుతామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.