వైకుంఠ ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు

వైకుంఠ ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు

మెహిదీపట్నం, వెలుగు: జియాగూడలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఫౌండర్, ట్రస్టీ త్రివేంగళాచార్యులు ఎస్టీ చారి, ఆలయ ప్రతినిధి శేషాచార్యులు, శ్రీనివాస రంగనాథ చార్యులు తెలిపారు. ఎప్పటిలాగే ఉత్సవాలకు ప్రభుత్వ సహకారం అందుతోందన్నారు. 

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ నెల 10న తెల్లవారుజామున 2 గంటల నుంచే ప్రత్యేక పూజలు మొదలవుతాయని చెప్పారు. 15న సాయంత్రం శ్రీ గోదా అమ్మవారి కరినోము ఉత్సవం, ధనుర్మాస వ్రత సమాప్తి ఉంటాయన్నారు. 350 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు చేపడుతున్నట్లు సీఐ సునీల్ తెలిపారు. ఉత్సవ బ్రోచర్​ను కార్పొరేటర్లు జి.శంకర్ యాదవ్, బోయిన్ దర్శన్, బీఆర్ఎస్​నేత జీవన్ సింగ్, కులుసుంపురా ఏసీపీ మున్వర్, సీఐ సునీల్, ఆలయ అధికారులు పాల్గొన్నారు