తన పనులు తాను చేసుకుంటూ ఔరా అనిపిస్తున్న వృద్ధురాలు
105 సంవత్సరాల వయసులో కూడా తన పనులు తాను చేసుకుంటూ ఓ బామ్మ ఔరా అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన గాజుల నరసమ్మ 105వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. డెకరేషన్ చేసి, ఫుల్ జోష్ తో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తన కొడుకులు, కూతుర్లు, మనుమలు, మనువరాల్లు, ముని మనుమలు, బంధు మిత్రులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.
అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్లను, బంధువులను పిలిచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. 5తరాలకు పెద్దదిక్కుగా ఉన్న వృద్ధురాలు నరసమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమారులు,కీర్తి శేషులు గాజుల వెంకటయ్య,గాజుల కొమురయ్య, గాజుల రాజయ్య,బాలయ్య ,కూతుర్లు దుర్గవ్వ , పోచవ్వ మనమలు,మనమరాలు, బంధుమిత్రులు, పాల్గొన్నారు.ముఖ్యఅతిథిగా వార్డు సభ్యులు పెంచల వనజ భూమేష్ జన్మ దిన వేడుకల్లో పాల్గొన్నారు.