కమనీయం..   చిలుకూరి బాలాజీ కల్యాణం

కమనీయం..   చిలుకూరి బాలాజీ కల్యాణం

చేవెళ్ల, వెలుగు: చిలుకూరి బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి తర్వాత ఆలయ ఆవరణలో స్వామివారి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. అర్చకులు నృత్యాలు చేస్తూ ఎదుర్కోళ్లు కార్యక్రమాన్ని రక్తికట్టించారు. అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరవాస్తు రామాచారి, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి తదితరులు పాల్గొన్నారు.  శుక్రవారం స్వామివారికి వసంతోత్సవము, గజ వాహన సేవలు చేశారు. స్వామి వారిని పల్లకిలో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు.