రమణీయం గోదాదేవి రంగనాథుల కల్యాణం

వెలుగు, నెట్​వర్క్ : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదాదేవి రంగనాథుల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ఆలయాల్లో గోదాదేవి–రంగనాథుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.