ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర

ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర
  • భారీగా తరలి వస్తున్న భక్తులు
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లిలో మల్లన్న జాతర ఘనంగా జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుడటంతో భారీగా జనసందోహం నెలకొంది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతారాజుల విన్యాసాలతో విజయచల గుట్టలో మల్లన్న నామస్మరణలు మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో, అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్, సానిటైజర్ ఉపయోగించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని భక్తులను కోరారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. కాగా భక్తులు భారీగా తరలి వస్తుండటంతో  స్వామివారి సర్వ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు. 

 

ఇవి కూడా చదవండి..

ఆ పాట నా కెరీర్​కి బిగ్గెస్ట్​ టర్నింగ్​ పాయింట్​

దళితులు లేని గ్రామానికి దళితబంధు