పండుగలా.. ప్రజాపాలన విజయోత్సవాలు

ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలను సర్కారు పండుగలా నిర్వహిస్తున్నది. ఎన్టీఆర్ మార్గ్​లోని హెచ్‌ఎండీఏ మైదానంలో శనివారం సంగీత విభావరి సంబురంగా సాగింది. భారీగా తరలివచ్చిన ప్రజలను ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ తన పాటలతో ఉర్రూతలూగించారు. పలువురు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫుడ్ స్టాళ్లలో తెలంగాణ వంటకాలు నోరూరించాయి. ఆదివారం ఎయిర్​షో జరగనుంది.