ఘనంగా వనదేవతల ఆలయాల మెలిగే పండుగ

ఘనంగా వనదేవతల ఆలయాల మెలిగే పండుగ

తాడ్వాయి, వెలుగు: వనదేవతల ఆలయాల మెలిగే పండుగ బుధవారం ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లిలో సారలమ్మ గుడిలో పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో కాకా వంశీయులైన పూజారులు, ఆడబిడ్డలు, సారలమ్మ దేవతకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

దీంతో సారలమ్మ పండుగ ప్రధాన ఘట్టం పూర్యయింది.రాత్రి పూజారులు జాగారాలు చేస్తూ పూజలు నిర్వహించారు. బయ్యక్కపేటలో సమ్మక్క దేవత పుట్టింట మెలిగే పండుగ చందా వంశీయులు వైభవంగా నిర్వహించారు. ప్రధాన పూజారి చందాబాబురావు ఆధ్వర్యంలో గుడిశుద్ధి పండుగను చేశారు. 

ప్రధాన పూజారి ఇంటినుంచి దేవుని (అడేరాలు)లను డప్పుచప్పుళ్లతో తరలి సమీపంలోని వాగులో గంగాస్నానానికి వెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆడబిడ్డలు మొక్కుబడులతో కలసి ఊరిలోని చందావంశస్తుల ఇంటినుంచి పయనమై సమ్మక్క గుడికి చేరుకున్నారు. ఆలయంలో పూజారి చందా రఘుపతి ఆధ్వర్యంలో పూజలు చేశారు. పూజారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.