పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా చండీ హోమం

 పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా చండీ హోమం

పాల్వంచ, వెలుగు : మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల నడుమ పల్లకిలో యాగశాలకు తీసుకువచ్చి వేద మంత్రోచ్ఛరణతో చండీ హోమం నిర్వహించారు. 

పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హోమంలో 25 మంది దంపతులు పాల్గొన్నారు. మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రజనీకుమారి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.