కరీంనగర్ జిల్లాలో .. గ్రాండ్‌‌గా క్రిస్మస్​ వేడుకలు 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని ప్రధాన చర్చిలు, ప్రార్థన మందిరాలు కిక్కిరిసిపోయాయి.  అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు క్రీస్తు బోధనలు వినిపించారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు.

కేక్​ కట్ చేసి పంపిణీ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.  కరీంనగర్​ సీఎస్​ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్​, జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, వేములవాడ, గొల్లపల్లిలో విప్​లు ఆది శ్రీనివాస్​, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ పాల్గొన్నారు. ​