యాదగిరిగుట్ట, వెలుగు : లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావై వేడుకను నిర్వహించారు. పూలు, వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలతో ముస్తాబు చేశారు. అనంతరం ఆండాళ్ అమ్మవారికి కట్టెపొంగలి ప్రసాదాన్ని నైవేద్యంగా అందించారు.
పాతగుట్టలో నాలుగో రోజు యాగం
యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సుదర్శన నారసింహ యాగం బుధవారంతో నాలుగో రోజుకు చేరుకుంది. గురువారం నిర్వహించే మహాపూర్ణాహుతితో సుదర్శన యాగం పరిసమాప్తి కానుంది. పలు రకాల పూజలు, వివిధ కార్యక్రమాల ద్వారా బుధవారం ఆలయానికి రూ.18,49,662 ఆదాయం వచ్చింది. ఇందులో ఎక్కువగా ప్రసాద విక్రయం ద్వారా రూ.8,45,940, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.2.50 లక్షల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.