కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జనం బుధవారం వైభవంగా సాగింది. శోభాయాత్రల్లో వేలాది మంది పాల్గొన్నారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ లో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్, మేయర్ సునీల్ రావు ఒకటో నంబర్ వినాయకుడికి పూజలు చేశారు. కొత్తపల్లి, చింతకుంట, మానకొండూర్ చెరువుల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. శోభాయాత్రలు, భక్తుల నృత్యాలు కన్నుల పండుగా జరిగాయి. వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని శోభాయాత్ర అకర్షణగా నిలిచింది.
ఒగ్గు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ నాగేంద్రచారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా, టవర్ సర్కిల్ కూడళ్ల మీదుగా చింత కుంట చెరువు వరకు శోభ యాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తున్నారు. ఎస్పీ ఎగ్గడి భాస్కర్, డీఎస్పీ వెంకటస్వామి, ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.