ఎస్పీకి గజమాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: బదిలీపై వెళ్తున్న ఆదిలాబాద్​ ఎస్పీ డి.ఉదయ్​కుమారెడ్డికి జిల్లా పోలీస్​సిబ్బంది శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా పోలీస్​హెడ్​క్వార్టర్స్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీని గజమాలతో సత్కరించారు. అనంతరం తాళ్లతో ఎస్పీ ఉన్న వాహనాన్ని లాగి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్​జిల్లా సిబ్బందిని విడిచి పోవడం బాధగా ఉందన్నారు.  

తన సర్వీసులో 20 ఏండ్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సేవలందించానని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సమయ్ జాన్ రావు, డీఎస్పీలు వి.ఉమేందర్, సీహెచ్ శ్రీనివాస్, జి.పోతారం శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, సీఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, డీసీఆర్ బీ, ఎన్ఐబీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.