ఎస్పీ గౌస్ ఆలంకు ఘనంగా వీడ్కోలు

ఎస్పీ గౌస్ ఆలంకు ఘనంగా వీడ్కోలు

ఆదిలాబాద్, వెలుగు: కరీంనగర్ కమిషనర్​గా బదిలీపై వెళ్తున్న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలంకు ఆదివారం పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా జిల్లా హెడ్ క్వార్టర్స్​లో పరేడ్ నిర్వహించి ఎస్పీకి పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. గజ మాలలతో సత్కరించారు. అనంతరం ఎస్పీ, ఆయన కుటుంబ సభ్యులు కూర్చున్న వాహనాన్ని హెడ్ క్వార్టర్స్ గేట్ వరకు లాగి సాదరంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చేసిన సేవలు మరువలేనివని, విడిచిపోవడం బాధాకరంగా ఉందన్నారు. 14 నెలలు పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, హసీబుల్లా, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, రిజర్వ్ సబ్ ఇన్​స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.