అందమైన ఇల్లు, రంగు రంగులగోడలు, అద్దంలా మెరిసే ఫ్లోరింగ్ ఉంటే సరిపోదు. ఇంటి పైకప్పు పైన కూడా కాస్తదృష్టి పెట్టాలి. అప్పుడే ఇంటికి కొత్త లుక్ వస్తుంది. అందమైన డిజైన్లతో పైకప్పుకి కొత్త రంగులద్దాలద్దేందుకు కొన్ని సీలింగ్స్ బెస్ట్ అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు.. ఇప్పుడు అలాంటి సీలింగ్ల గురించి తెలుసుకుందాం. . . .
ఫాల్స్ సీలింగ్
అందుకే అల్యూమినియం ఫ్రేమ్, పాస్టర్ ఆఫ్ ప్యారిస్ లతో చేసే ఫాల్స్ సీలింగ్". ఇంటీరియర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫాల్స్ సీలింగ్ తో ఇంటి పైకప్పును. డైమండ్, చతురస్రం, గోళాకారం షేప్స్ లో అలంకరించొచ్చు. అయితే మొదట ప్రైమర్ సీలింగ్ వేసి దానికి రెండు నుంచి మూడు అంగుళాల కింద ఫాల్స్ సీలింగ్ వేయాలి అలాగే ప్రైమర్ సీలింగ్, ఫాల్స్ సీలింగ్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
డిజైన్ టైల్స్ తో ఉన్న సీలింగ్స్ ను ఎంచుకుంటే పెయింటింగ్ ఖర్చు కూడా. తగ్గుతుంది. కొత్తగా కడుతున్న ఇళ్లకే కాకుండా. పాత ఇంటికి సైతం ఈ ఫాల్స్ సీలింగ్ వేయించుకోవచ్చు. కానీ గోడ రంగులతో పోల్చుకుంటే సీలింగు వేసే రంగు లైట్ గా ఉండేలా చూసుకోవాలి. మోనో క్రోమ్ థీమ్ ను ఎంచుకుంటే న్యూలుక్ వస్తుంది. ఇవేకాకుండా లేత గులాబీ. లేత ఎరుపు రంగుల్ని కూడా ఎంచుకోవచ్చు.
రాఫ్టర్ సీలింగ్
ఈ సీలింగ్ మొత్తాన్ని దీర్ఘచతురస్రాలుగా లేదా త్రికోణాకారాల్లో విడగొట్టి వాటిలో లైటింగ్ ఏర్పాటు చేయడమే రాఫ్టర్ సీలింగ్. సెంటర్ ప్యానెల్ లో సీలింగ్ ఫ్యాన్స్ లేదా షాండ్లియర్ వేలాడదీస్తే ఈ సీలింగ్ కి స్పెషల్ -లుక్ మస్తుంది. ఇలా చేస్తే గదికి క్లాసీ లుక్ తో పాటు నిండుదనం వస్తుంది.
రూఫ్ సీలింగ్
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడకంలో ఉంది రూఫ్ సీలింగే. ప్లెయిన్ గా కనిపించే వైట్ రూఫ్ కంటే అందమైన డిజైన్లలో, రంగుల్లో, లైటింగ్ తో ఉండే ఎట్రాక్టివ్ రూప్ సీలింగ్ బాగుంటుంది. ఇలాంటి రూఫ్ అందం రెట్టింపు చేయాలంటే దానిలో ఎల్ఈడీ లైట్లను పెట్టాలి.
రూఫ్ కు స్టెన్సిల్ డిజైన్ వేయించి మధ్యలో స్కై లైటింగ్ ఫిక్స్ చేస్తే గది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రూఫ్ మధ్యలో దీర్ఘచతురస్రాకారంలో కటవుట్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఈ సీలింగ్ ఇంకా ప్రత్యేకంగా కనిపించాలంటే లోపలి భాగంలో ఒక రంగఁ మధ్యలో ప్రత్యేకంగా కనిపించే సీలింగ్ కు వేరొక రంగు వేయించాలి. మధ్యలో అందమైన షాండ్లియర్ వేలాడదీస్తే గది మొత్తానికి సీలింగ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
బీమ్ సీలింగ్
చెక్క దుంగలతో చేసే ఈ సీలింగ్ ఇంటికి క్లాపీ లుక్ తెస్తుంది. ఈ సీలింగ్ కి రెండుమూడు అంగుళాల దూరంలో చిన్నచిన్న లైట్స్ వేలాడదీస్తే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. కావాలంటే ఫాల్స్ సీలింగ్ తో కూడా బీమ్ సీలింగ్ చేసుకోవచ్చు. అదెలా అంటారా కలప దుంగలా కనిపించే ఫాల్స్ సీలింగ్స్ ఎంచుకుని వాటికి ఉడెన్ లుక్ తెప్పించటం కోసం ఆ రంగులతో డిజైన్ గీయాలి. బీమ్ పీలింగ్ సింపుల్ గా కనిపిస్తుంది. కానీ, ఇంటికి గ్రాండ్ లుక్ తెస్తుంది. డైనింగ్ స్పేస్లో ఈ సీలింగ్ చేయిస్తే లుక్బాగుంటుంది.
వాల్టెడ్ సీలింగ్
ఈరకమైన సీలింగ్ లో స్లోప్స్, యాంగిల్స్ ఉంటాయి. ఈ సీలింగ్ చూసేందుకు పొదరిల్లులా ఉంటుంది. లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లో ఈ తరహా సీలింగ్ లు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. రెండు వైపులా కిందకి జారినట్టుండే పోప్స్ మధ్యలో స్కైలైట్స్ ఏర్పాటుచేసే వాల్టెడ్ సీలింగ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. గ్రాండ్ లుక్ వస్తుంది. పిల్లల బెడ్ రూంలో ఈ తరహా సీలింగ్ వేయించాలనుకుంటే వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించచ్చు.
–వెలుగు.. లైఫ్–