![నాగ సాధువులు.. అఖాడాలు కుంభమేళాకు ఇలా వీడ్కోలు పలుకుతారు](https://static.v6velugu.com/uploads/2025/02/grand-maha-kumbh-melaconcludesnaga-sadhus-and-akadas-sacred-experience_2wO4hjXl8D.jpg)
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరుగుతుంది. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినాన చివరి అమృత స్నానం ముగిసిన వెంటనే కుంభమేళా పవిత్ర స్నానాలు ముగుస్తాయి. ఇక ఆ రోజు వరకు నెల రోజుల పాటు ప్రయాగ్ రాజ్ లో సందడి చేసిన నాగ సాధువులు.. అఖాడాలు.. సన్యాసులు అందరూ మళ్లీ హిమాలయాల్లోకి వెళతారు.
కుంభమేళాలో నాగసాధువుల సమావేశాలు.. వారి పూజా కార్యక్రమాలు లక్షలాది మందిని ఆకర్షించారు. ఫిబ్రవరి 26 వరకు అక్కడ త్రివేణి సంగమం నదీతరంలో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సదస్సులు కూడా ఉంటాయి. ఇప్పటికే అనేక సదస్సులు జరిగాయని వార్తాకథనాలు వెలువడ్డాయి. నాగ సాధువులు..అఖాడాలు.. సన్యాశులు ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసుకున్న గుడారాలను .... కుంభమేళా ముగింపు సమయం దగ్గర పడటంతో కూల్చి వేస్తున్నారు. నాగసాధువులు చివరి అమృత స్నానం అనంతరం తదుపరి ప్రయాణాలకు సమాయత్తమవుతున్నారు. అయితే అఖాడాలు.. నాగ సాధువులు వెళ్లేముందు చివరి సామూహిక భోజనం చేసే పురాతన సంప్రదాయాన్ని పాటిస్తారు.
ఈ నెల రోజులు ఇక్కడ గడిపిన స్నేహ పూర్వక వాతావరణాన్ని చర్చించుకుంటూ.. తపస్సు చేసిన సన్యాసులతో కలిసి భోజనం చేస్తారు. ఇలా విందు భోజనం చేయడం వినోదం .. ఇంకా ఇతర కారణాలతో కాదని.. కలిసి ఉండేందుకు నాగ సాధువులు.. సన్యాసులు.. అఖాడాలు ఆచరించే బుటాసా ఆచారబని జునా అఖాడాకు చెందిన సాధువు స్వామి అనంతగిరి తెలిపారు. ఆధ్యాత్మిక సాధనలో వారు జీవితం గడిపేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ఒకరికొకరు కృతఙ్ఞతలు చెప్పుకునేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసుకుంటారన్నారు.
Also Read :- మమకారం..మాయ అంటే ఏమిటి.. రామకృష్ణ పరమహంస వివరణ ఇదే..
మహాశివరాత్రి రోజు ( ఫిబ్రవరి 26) చివరి అమృత స్నానం అనంతరం శివుని అనుచరులుగా భావిస్తున్న శైవ అఖాడాలు.. కమండలాలు, త్రిశూలాలు.. రుద్రాక్షమాలలతో పాటు ఆధ్యాత్మిక సాధనకు..తపస్సుచేసుకునేందుకు కావలసిన కొద్దిపాటి వస్తువులను తీసుకొని బయలు దేరతారు. కుంభమేళాలో మహాశివరాత్రి వరకు ఎగుర వేసిన ఆధ్యాత్మిక జండాకు భక్తితో నమస్కరిస్తారు. వెళ్లేటప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి, పవిత్ర బూడిదను శరీరానికి రాసుకుంటారు.
కుంభమేళా నదుల సంగమం కాదని.. ఆత్మల సంగమం అని జునా అఖాడాకు చెందిన మహంత్ అవధేశానంద గిరి అన్నారు.
గంగా తరంగాల వలె కలిసి వచ్చి.. చెల్లాచెదరుగా వెళ్లే విధంగా కుంభమేళా జరిగే ప్రదేశానికి ..సాధువులు.. సన్యానులు.. అఖాడాలు వచ్చి పవిత్ర సారాన్ని తీసుకెళతారని ఉదాసిన్ అఖాడాలు తెలిపారు. ప్రస్తుతం రద్దీగా ఉన్న గుడారాలు ఫిబ్రవరి 26 తరువాత ఖాళీగా ఉంటాయి. మళ్లీ తరువాత కుంభమేళా కోసం ఎదురుచూస్తూ ఆధ్యాత్మిక భావనతో గడుపుతూ ఉంటామని స్వామి శివానంద సరస్వతి తెలిపారు.