![వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం](https://static.v6velugu.com/uploads/2025/02/grand-marriage-ceremony-of-sridevi-bhudevi-and-sri-lakshminarayana-swamy-held-at-venkateswara-swamy-temple_EZfVxTmOpb.jpg)
కరీంనగర్ సిటీ, వెలుగు: ముత్యాల తలంబ్రాలు.. మంగళవాయిద్యాలు.. వేదపండితులు వేదమంత్రోచ్చరణలు.. గోవింద నామస్మరణల మధ్య శ్రీదేవి భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీలక్ష్మీనారాయణస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్కెట్‌రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
స్వామి తరఫున ప్రతినిధులుగా వ్యవహరించగా మంత్రి దంపతులు వ్యవహరించగా.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల తరఫున కన్యాదాతలుగా వ్యవస్థాపక ధర్మకర్తలుగా చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కె.సుదాకర్ వ్యవహరించి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం గరుడ వాహనంపై ఆలయ మాఢవీధుల్లో శ్రీవారు విహరిస్తూ కనువిందు చేశారు. గోగుల ప్రసాద్ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు, సాయంత్రం సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు, పాటలు భక్తి పాటలు అలరించాయి.