వెలుగు, జీడిమెట్ల/పద్మారావునగర్/ఫొటోగ్రాఫర్స్ : కొత్త సంవత్సరానికి గ్రేటర్ ప్రజలు గ్రాండ్ వెల్కమ్చెప్పారు. మంగళవారం రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్తో సిటీ హోరెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీతోపాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లలో యూత్ పాల్గొని ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ తో కలిసి ఉర్రూతలూగించే పాటలకు హుషారుగా డ్యాన్సులు చేశారు. కస్టమర్లతో బేకరీలు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు కిటకిటలాడాయి. లిక్కర్‌షాపుల వద్ద మందుబాబులు బారులు తీరి కనిపించారు.
సుచిత్రలోని మై ఫ్రెండ్ సర్కిల్ రెస్టారెంట్ ముందు అర కిలోమీటర్ మేర బిర్యానీ ప్రియులు, ఫుడ్ డెలివరీ బాయ్స్ క్యూ కట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీలు సీపీ సీవీ ఆనంద్, అవినాష్ మహంతి, సుధీర్‌బాబు పర్యవేక్షించారు. ఓఆర్‌ఆర్ ,పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైకి హెవీ వెహికల్స్ మినహా కార్లను అనుమతించలేదు. 66 లొకేషన్స్‌లో డీడీ, స్పీడ్ కంట్రోల్ టీమ్స్ చెకింగ్ పాయింట్స్ నిర్వహించాయి.